Friday, December 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం17 ఏండ్ల తర్వాత స్వదేశానికి..

17 ఏండ్ల తర్వాత స్వదేశానికి..

- Advertisement -

బంగ్లాదేశ్‌కు బీఎన్‌పీ చైర్మెన్‌ తారిక్‌ రెహమాన్‌

ఢాకా : బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) యాక్టింగ్‌ చైర్మెన్‌ తారిక్‌ రెహమాన్‌ 17 సంవత్సరాల ప్రవాసం తర్వాత గురువారం ఢాకా చేరుకున్నారు. ఆయన కోసం భారీగా జనం తరలివచ్చారు. హజ్రత్‌ షాజలాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 300 అడుగుల రోడ్డు సమీపంలో ఆ పార్టీ కార్యకర్తలు, జనం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రెహమాన్‌ రాక కోసం దేశం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు ఢాకాలో గుమిగూడారు. బంగ్లాదేశ్‌ మాజీ అధ్యక్షుడు జియావుర్‌ రెహమాన్‌, మాజీ ప్రధాని బేగం ఖాలీదా జియా కుమారుడే ఈ రెహమాన్‌. ఈయన ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -