Saturday, November 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరేవంత్‌రెడ్డి అభివృద్ధి చూపించి.. ఓట్లు అడగాలి

రేవంత్‌రెడ్డి అభివృద్ధి చూపించి.. ఓట్లు అడగాలి

- Advertisement -

కాంగ్రెస్‌ను ఓడించి అరాచకాన్ని, అవినీతిని తరిమికొట్టాలి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
జూబ్లీహిల్స్‌ వెంగళరావునగర్‌లో రోడ్‌ షో
నవతెలంగాణ-జూబ్లీహిల్స్‌

రేవంత్‌రెడ్డికి దమ్ముంటే తన 24 నెలల పాలనలో చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలు చూపించి ఓట్లు అడగాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. చేసిందేమీ లేకపోవడంతోనే రేవంత్‌రెడ్డి అటెన్షన్‌ డైవర్షన్‌ ప్రయత్నాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వెంగళరావు నగర్‌లో రోడ్డు షో, కార్నర్‌ మీటింగ్‌లో కేటీఆర్‌ మాట్లాడారు. పోలింగ్‌ కంటే ముందే రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని, అందుకే ఈ ఎన్నిక తన ప్రభుత్వానికి, పరిపాలనకు, తనకు రెఫరెండం కాదని చెప్పారన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమని స్పష్టమైందన్నారు. రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేశారన్నారు. ఇవే అబద్ధాల మాటలు చెప్పి కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్క రూపాయి అభివృద్ధి పని కూడా చేయలేదని అన్నారు. రెండు సంవత్సరాలలో హైదరాబాద్‌ నగరాన్ని పూర్తిగా పతనావస్థకు చేర్చి.. రియల్‌ ఎస్టేట్‌ నుంచి మొదలుకొని ఆటో డ్రైవర్ల వరకు అందరి ఉపాధి అవకాశాలపై దెబ్బకొట్టారని అన్నారు. హైడ్రా పేరుతో అరాచకం చేస్తున్నారని, వేలాదిమంది పేదల ఇండ్లు కూలగొట్టిన రేవంత్‌రెడ్డి పెద్దవాళ్ల అక్రమాల జోలికి వెళ్లలేదని విమర్శించారు. హైడ్రా బుల్డోజర్‌ పేదల ఇంట్లు, బస్తీల జోలికి రావద్దు అంటే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -