Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి: సీపీఐ(ఎం)

కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ- తుంగతుర్తి
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి అంటూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు పిలుపునిచ్చారు. గురువారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మండల కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ బడా పెట్టుబడిదారులకు, ఈదేశ సంపదను అప్పజెప్పి పేద మధ్యతరగతి వర్గాల ప్రజలపై అనేక భారాలను మోపుతున్నదని విమర్శించారు. అనేక సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను తొలగించి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల బ్రతుకులను బజారుకు ఈడ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా విద్యుత్ సంస్కరణల పేరుతో రైతాంగానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులను కలిగిస్తుందని, నూతన విత్తన ఒప్పందాలను తీసుకొచ్చి రైతు నోట్లో మట్టి కొట్టిందని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని తొలగించి, జివి రామంజి అనే పేరుతోటి ఉపాధి పథకం తీసుకొచ్చి పేదల పొట్ట కొడుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి దేశంలో యువకులకు ఉపాధి ఉద్యోగం లేకుండా నిరాశకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలైన పెద్ద పెద్ద పరిశ్రమలను, బ్యాంకులను, ఇన్సూరెన్స్లను,రైల్వేలను చివరికి రక్షణ రంగాలను కూడా ప్రైవేట్ పరం చేసి దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని విచారణ వ్యక్తం చేశారు. నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచడం ద్వారా అసంఘటితరంగ కార్మికులు కూడు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే కార్మిక సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు ప్రభుత్వంపై ఐక్యంతో పోరాటాలు కొనసాగిస్తారని అన్నారు. ఈ సమ్మె కేంద్ర ప్రభుత్వం కనువిప్పు కలిగే విధంగా దేశవ్యాప్తంగా విజయవంతమైందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బుర్ర శ్రీనివాస్,ఏఐటీయూసీ జిల్లా నాయకులు రాజారాం, బొంకూరి శ్యాంసుందర్, కోట రామస్వామి, అంగన్వాడీ వర్కర్స్ తుంగతుర్తి ప్రాజెక్టు గౌరవాధ్యక్షురాలు ధనలక్ష్మి, స్వరూప, మంగమ్మ,స్వప్న,విజయలక్ష్మి, మాధవి, కళమ్మ, ఉమ, భాగ్యమ్మ, మాజీ జెడ్పిటిసి తాటి విజయమ్మ, పల్లా సుదర్శన్, పాల్వాయి పున్నయ్య, గడ్డం ఎల్లయ్య, జాజుగాల్ల ముత్తయ్య, ఉప్పుల సోమయ్య, యాదగిరి, బోనాల వెంకన్న , రామచంద్రు, గ్రామపంచాయతీ వర్కర్స్, హమాలి సంఘం నాయకులు, బిల్లింగ్ వర్కర్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -