నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని రెసిడెన్షియల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వార్డెన్ల తో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ఆదేశాల మేరకు, స్థానిక తాసిల్దార్ సురేష్ బాబు, ఎంపీడీవో సుమన వాణి, ఎంపీ ఓ శ్రీధర్ రావు లు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల బాగోగులు దగ్గరుండి చూసుకోవాలన్నారు. ఆహారము, పరిసరాలు ఆరోగ్యం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు, చెత్తాచెదార లేకుండా పరిసరాలను ఉంచుకోవాలన్నారు.
మలేరియా దోమలు వ్యాప్తి చెందకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో, హాస్టల్లో రెగ్యులర్ గా ఈఎన్ఎం విధులు నిర్వర్తించేలా చూడాలన్నారు. విద్యార్థి ఆరోగ్యంగా ఎదుగుతేనే, మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. ఈ వర్షాకాలం సీజన్లో సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ జె సురేష్ బాబు, ఎంపీడీవో సుమన వాణి, ఎంపీ ఓ జాలా శ్రీధర్ రావు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.
రెసిడెన్షియల్ పాఠశాలలో సమీక్షా సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES