Thursday, March 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనింగినంటుతున్న షిప్పింగ్‌ బీమా ప్రీమియంలు

నింగినంటుతున్న షిప్పింగ్‌ బీమా ప్రీమియంలు

- Advertisement -

దుబాయ్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని కుదిపేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్‌ సంయుక్తగా ఇరాన్‌పై సాగిస్తున్న దాడులు, ప్రతిదాడుల కారణంగా సముద్ర మార్గంలో సరుకు రవాణా అత్యంత వ్యయభరితంగా మారుతోంది. ముఖ్యంగా ఇరాన్‌ హెచ్చరికల నేపథ్యంలో కీలకమైన హోర్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతుండటంతో బీమా కంపెనీలు షిప్పింగ్‌ కంపెనీలపై బీమా ప్రీమియంలను భారీగా పెంచుతున్నాయని తెలుస్తోంది.

యుద్ధ భయం కారణంగా నౌకలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడం ఒక ఎత్తయితే, బీమా సంస్థలు రిస్క్‌ దృష్ట్యా ప్రీమియం ధరలను పెంచడం ఎగుమతి, దిగుమతిదారులకు అశనిపాతంలా మారిందని ఆ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. సాధారణంగా సముద్రంలో ప్రమాదాలు లేదా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నౌకలకు, అందులోని సరుకులకు బీమా చేయిస్తారు. అయితే ప్రస్తుతం యుద్ధం కారణంగా నౌకలే లక్ష్యంగా దాడులు జరుగుతుండటంతో బీమా కంపెనీలు తమ నిబంధనలను కఠినతరం చేస్తూ చార్జీలను పెంచుతున్నాయి. ఈ అదనపు భారం నేరుగా సరుకుల ధరలపై పడనుంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్‌ వస్తువుల వరకు అన్నింటి ధరలు పెరిగి, చివరికి వినియోగదారుడి జేబుకు చిల్లు పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -