– స్థాయి మరిచి వైద్యం చేయడంతోనే అనర్ధాలు
– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యాధి ఏదైనా,ఎక్కడైనా ప్రధమ చికిత్స అందించేది మాత్రం స్థానిక ఆర్ఎంపీ లే నని, అయితే కొందరు తమ స్థాయి మరిచి అత్యాశతో వైద్యం చేయడంతోనే అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయి అని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. శనివారం స్థానిక లహరి ఫంక్షన్ హాలో నిర్వహించిన టీఎస్ ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించారు.
సంఘం మండల అధ్యక్షులు షేక్ ఉస్మాన్ (బాబా) అధ్యక్షతన జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రాత్రనక పగలనక,ఎవర పిలిచినా,ఎంత దూరం పిలిచినా వైద్యం అందిస్తూ స్థానికుల మన్ననలు పొందుతున్నారని అన్నారు. కొద్ది మంది తమ పరిధులు దాటి వైద్యం చేస్తున్నారని దీంతో మిగతా అందరికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు.
ఆర్ఎంపీ లు ఎన్నికల్లో ఎంతో తోడ్పాటును అందించారని అన్నారు.ఆర్ఎంపీ ల సమస్య పై ప్రభుత్వం తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.అందరూ ఏకతాటిపై ఉండి ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ బి.నాగరాజు, ఆత్మ(బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు,కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు,ముఖ్యనాయకులు జూపల్లి రమేష్,సంఘం నాయకులు బండి కొమరయ్య, శ్రీనివాసరావు,చిన్ని,రమేష్, దమ్మపేట మండల అధ్యక్షులు వాహాబ్, ఆర్ఎంపీ లు పాల్గొన్నారు.



