Thursday, January 1, 2026
E-PAPER
Homeక్రైమ్కొత్తగట్టు వద్ద రోడ్డు ప్రమాదం.. 9 మందికి గాయాలు

కొత్తగట్టు వద్ద రోడ్డు ప్రమాదం.. 9 మందికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు 
మండలంలోని కొత్తగట్టు గ్రామ శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కంపేట గ్రామానికి చెందిన సిలువేరు ప్రసాద్, కవిత దంపతులు ఆటోలో వేలంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బగవత్ నరేష్ నడుపుతున్న ఓ బైకు, కురుసపల్లి ప్రభాకర్ నడిపుతున్న మరో ఆటో కూడా అదే మార్గంలో ప్రయాణిస్తున్నాయి. ఇదే సమయంలో హనుమకొండకు చెందిన ఇమ్మడి వంశీ తన కారును అతివేగంగా నడుపుతూ ముందున్న వాహనాలను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అదుపు కోల్పోయి, రెండు ఆటోలు, ఒక బైక్‌కు ఢీకొట్టాడు. దీంతో ఒక ఆటో బోల్తా పడగా, ఆటోల్లో, బైక్‌పై ప్రయాణిస్తున్న తొమ్మిది మంది గాయపడినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఎంజిఎం ప్రభుత్వ ఆస్త్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -