Tuesday, May 20, 2025
Homeతాజా వార్తలుఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పరిగి మండల పరిధిలోని నేషనల్ హైవే 163పై రంగాపూర్ వద్ద రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. అందులో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మల్లేష్, సందీప్, బాలమణి, హేమలతగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారికి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. పరిగి పట్టణంలో డిన్నర్‌కు హాజరై ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి బృందం వారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల చందనవెళ్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా వారు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -