- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
99 రోజుల ప్రగతి కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 10న మంగళవారం మద్నూర్ మండలంలోని తడి ఇప్పర్గా గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్న గ్రామ కార్యదర్శి జ్యోతి ఆధ్వర్యంలో గ్రామంలోని రోడ్లు క్లీన్ చేశారు గ్రామంలో శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలలో చేపడుతున్న రోజువారి కార్యక్రమంలో భాగంగా రోడ్లు క్లీన్ కార్యక్రమాన్ని పారిశుద్ధ్య కార్మికులు చేపట్టారు. గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడంతో గ్రామ సర్పంచ్ గ్రామ కార్యదర్శి నీ గ్రామస్తులు అభినందించారు.
- Advertisement -



