Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాచికల్ క్రాస్ నుండి మేచరాజు పల్లి వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలి

కాచికల్ క్రాస్ నుండి మేచరాజు పల్లి వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలి

- Advertisement -

రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఆటో యూనియన్,గ్రామస్తులు 
అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ సౌకర్యం కూడా నోచుకోలేకపోతున్నాం
కాచికల్ క్రాస్ నుంచి మేచరాజుపల్లి వరకు రోడ్డు పనులు ప్రారంభించి వదిలేశార
కాచికల్ ఎర్రబెల్లి గూడెం గ్రామ ప్రజలు
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని కాచికల్ ఎర్రబెల్లి గూడెం మీదిగా మేచరాజుపల్లి వరకు రోడ్డు మంజూరు చేయించి పనులు చేయించాలని ఆటో యూనియన్ అధ్యక్షుడు ఓంగాళా సోమయ్య ఆటో యూనియన్ గౌరవాధ్యక్షులు భూముల శ్రీనివాస్ గుండబోయిన బాలకృష్ణ మహిళా సంఘం నాయకులు సుర ఎల్లమ్మ మంజుల ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్  కోరారు.  ఆదివారం కాచికల్ క్రాస్ రోడ్డు వద్ద మాట్లాడుతూ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం గ్రామంలో ఆటో యూనియన్, గ్రామస్తులు కలిసి రోడ్డు దుస్థితి మారాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రోడ్డు మరమ్మతులకై  రోడ్డు త్రవ్వకాలు ప్రారంభించారు, ఆ త్రవ్వకాలతో గుంతల మయంగా రోడ్లు, పడి రాకపోకలకు ఇబ్బందులు కలిగే విధంగా ఉన్నాయని అన్నారు. అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ ఈ గ్రామాలకు రావాలన్నా పోవాలన్న ఎంతో సమయం పడుతుందని దీంతో రోగాల పాడిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీసం ఆ రోడ్లపై ఆటో నడిచే పరిస్థితి కూడా లేదని పట్టించుకున్న నాథుడు లేడంటూ ఆ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చెందారు. కాచికల్ ఎర్రబెల్లి గూడెం మేచ రాజు పల్లి వరకు రోడ్డు సౌకర్యం కల్పించి ప్రజలను ఆదుకోవాలని అన్నారు. బస్సు సౌకర్యలేక గ్రామస్తులు అనే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

అంతేకాకుండా విద్యార్థులు చదువుకునేందుకు మండల కేంద్రానిక చేరుకునేందుకు  అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మండల కేంద్రానికి ఏ పని మీద నైనా గ్రామస్తులు వెళ్తున్నారని కనీసం ఆరోగ్యం బాగా లేకపోయినా మండల జిల్లా డివిజన్ కేంద్రాలకి  పోవడానికి కూడా సరైన టైంలో. బస్సు సౌకర్యం లేక రోడ్డు సక్రమంగా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కనీసం ఆటోలో వెళ్దాం అన్నా ఆటో వెళ్లే లేని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కాచి కాచికల్ ఎర్రబెల్లి గూడెం మేచరాజు పల్లి వరకు రోడ్డు మంజూరు చేయించి రోడ్డు తొందరగా పనుల ప్రారంభించి మా ప్రాంత ప్రజలను కాపాడాలని తెలిపారు,

మీ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార కృషి చేస్తా : ఎస్సై రమేష్ బాబు 

ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా మీరు నిరసనను విరమింప చేయాలి. సంబంధిత అధికారి కి తెలియపరచి మీ సమస్యను పరిష్కారానికి కృషి చేస్తానని వారికి నచ్చజెప్పి ఆందోళన స్థలానికి చేరుకున్న ఎస్సై రమేష్ బాబు, నిరసనను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్, గ్రామస్తులు,మహిళాలు మహంకాళి వెంకటయ్య పండికేరా సతీష్ అశోక్ నాగన్న సందీప్ అశోక్ రెండు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -