– ఇలాగైతే మేడారం జాతరకు వెళ్లేదెలా?
– అసంపూర్తిగా బ్రిడ్జిల నిర్మాణం
– బ్లాక్ స్పాట్స్‌తో ముప్పు
– పోలీసులకు సవాల్‌గా మారిన వైనం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మేడారం జాతర రాకపోకలు సమస్యాత్మకంగా మారనున్నాయి. వరంగల్-ములుగు జాతీయ రహదారిపై పలు చోట్ల నిర్మాణాలు నేటికీ పూర్తి కాకపోవడంతో రోడ్డు భద్రతా గందరగోళంగా మారింది. జాతీయ రహదారి మధ్య ఎస్సారెస్పీ కాలువలపై నిర్మించాల్సిన బ్రిడ్జిల పనులు నేటికీ పూర్తి కాకపోవడంతో పోలీసులకు సమస్యాత్మకంగా మారాయి. వరంగల్-ఏటూర్‌నాగారం వరకు 4 లైన్ల రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నా ఈ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. బ్లాక్ స్పాట్స్‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
వరంగల్-ములుగు జాతీయ రహదారి మధ్య ఎస్సారెస్పీ కాలువలపై ఒగ్లాపూర్, ఊరుగొండ, కటాక్షపూర్, మల్లంపల్లి వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణం పూర్తి కాకపోవడంతో మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవు. ఒగ్లాపూర్ వద్ద ఎస్సారెస్పీ కాలువ వద్ద ఒకవైపు బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. రెండో వైపు బ్రిడ్జిపై నిర్మాణం క్యూరింగ్ పూర్తి కావాల్సి ఉంది. ఇదిలావుంటే ఊరుగొండ వద్ద ఎస్సారెస్పీ కాలువపై ఒకవైపు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. రెండో వైపు స్లాబ్ నేటికీ వేయలేదు. దాంతో రాకపోకలకు ఈ ప్రాంతంలో ఇబ్బందికరంగా మారింది. ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువు వద్ద హై లెవల్ వంతెన నిర్మాణం నేటికీ నిర్మాణ దశలోనే ఉంది. దాంతో ఈ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులతోపాటు వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ రోడ్డు నుంచి కటాక్షపూర్ వరకు బీటీ రోడ్డు చాలా చోట్ల దెబ్బతిన్నది.
ఇరుకైన వంతెనలపై నిర్లక్ష్యం
ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ రోడ్డు-కటాక్షపూర్ క్రాస్ రోడ్డుల మధ్య రెండు చోట్ల ఇరుకైన వంతెనలు రాకపోకలకు అంతరాయంగా మారాయి. ఈ రెండు వంతెనలను వెడల్పు చేసి అభివృద్ధి చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వహించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
బ్లాక్ స్పాట్స్‌తో ముప్పు
వరంగల్-తాడ్వాయి వరకు జాతీయ రహదారి ముఖ్యంగా దామెర మండలంలోని ఒగ్లాపూర్ వద్ద, ఊరుగొండ వద్ద కాలువలపై నిర్మిస్తున్న బ్రిడ్జిలు అసంపూర్తిగా ఉన్నాయి. మల్లంపల్లి వద్ద ఎస్సారెస్పీ కాలువ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం, ముఖ్యంగా ఈ ప్రాంతం వంపుగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పోలీసు అధికారులు ఈ బ్లాక్‌స్పాట్స్‌పై అప్రమత్తంగా విధులను నిర్వహించాల్సి ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం తప్పనిసరి. రోడ్డు భద్రతా చర్యలను పాటించడానికి ఒకవైపు పోలీసు, మరోవైపు రవాణా శాఖాధికారులు జాతర రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
రోడ్డు భద్రత గాలికి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



