Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి: సర్పంచ్

రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
వాహ‌న‌దారులు ప్ర‌తి ఒక్క‌రూ రోడ్డు భ‌ద్ర‌తా నియ‌మాలు పాటిస్తూ సుర‌క్షితంగా త‌మ గ్య‌మ‌స్థానాల‌కు చేరుకోవాల‌ని అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గ్రామ సభ నిర్వహించి రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై, అరైవ్-అలైవ్ పై అవగాహన కల్పించి మాట్లాడారు. హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధాన్యత, డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు.

రోడ్డుపై విధుల్లో ట్రాఫిక్ పోలీసులు ఉన్నా, లేకపోయినా వాహనాలను నడిపేటప్పుడు నియమ, నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి తమ ప్రాణ భద్రతతో పాటు, ఇతరుల భద్రతకు కూడా సహకరించాలని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడ్ వల్ల‌ కలిగే ప్రమాదాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా గ్రామ సభలోని ప్రజల అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ వెలిశాల సరిత, వార్డు మెంబర్లు సుకన్య, లావణ్య, ఉమ, జానమ్మ, శ్యామ్, పంచాయతీ కార్యదర్శి దుండి రమేష్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -