Thursday, February 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రాభివృద్ధిలో రోడ్లు కీలకం

రాష్ట్రాభివృద్ధిలో రోడ్లు కీలకం

- Advertisement -

బడ్జెట్‌ ప్రతిపాదనపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు భవనాలు శాఖ పాత్ర ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్‌ అంచనాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు లాంటి గేమ్‌ చేంజర్‌ ప్రాజెక్టులపై ప్రధాన దృష్టి సారించాలని అన్నారు. బుధవారం 2026-27 బడ్జెట్‌ సమీక్ష చేశారు. ఇందులో స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌రాజ్‌, ఈఎన్సీలు మోహన్‌నాయక్‌, జయ భారతి, సీఈలు శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, వసంత్‌నాయక్‌, బీవీ రావు, లింగారెడ్డి, నర్సింగ్‌రావు, పలువురు ఆర్‌ అండ్‌ బీ అధికారులు పాల్గొన్నారు. గత ఏడాది బడ్జెట్‌ పనుల పురోగతి విడుదలైన నిధులపై కూలంకషంగా మంత్రి అడిగి తెలుసుకున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర రోడ్‌ నెట్వర్క్‌ అభివద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని గుర్తుచేశారు. హ్యామ్‌ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర వ్యాప్తంగా అద్దం లాంటి రోడ్లు నిర్మించబోతున్నామని చెప్పారు. ఇప్పటికే ఉన్న బాలారిష్టాలు దాటేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశామనీ, అధికారులు కూడా మనసుపెట్టి పనిచేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాపై కన్ఫ్యూజన్‌ లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్‌-విజయవాడ (65) లేన్‌ విస్తరణ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని వివరించారు. పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని మరోసారి కోరతానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన రోడ్డయిన హైదరాబాద్‌ నుంచి విజయవాడ రెండున్నర గంటల్లో చేరుకోవచ్చని చెప్పారు. రాష్టాభివృద్ధిలో భాగంగా కేంద్ర సహకారం అందించే ప్రాజెక్టుల్లో వేగం పెంచాలని కేంద్ర మంత్రులను కలుస్తానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -