వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం
గుంటూరు : రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందిన కొందరు క్యాటరింగ్ పనులు చేస్తున్నారు. ఈ పనిలో భాగంగా బుధవారం తిరుపతికి వచ్చిన వారు హైదరాబాద్‌కు టొయోటా క్వాలిస్ వాహనంలో గురువారం రాత్రి బయల్దేరారు. శుక్రవారం తెల్లవారుజామున ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సమీపంలోని సబ్ స్టేషన్ వద్ద వారి కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢకొీట్టింది. అనంతరం రోడ్డుకు అటువైపు వెళ్లి ఎదురుగా వస్తున్న సిజిఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢకొీనడంతో కారులో ప్రయాణిస్తున్న గుండెరావు కులకర్ణి (46), శ్రావణ్ (21), ఇటికాడి నరసింహులు (30), సిద్ధప్ప (50) అక్కడక్కడే మృతి చెందారు. గుండెరావు కులకర్ణి కుమారులు శివ సాయి కులకర్ణి, సిద్ధార్థ కులకర్ణి తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలో అంకిరెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢకొీనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. వారిలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సుశీల (64), వెంకయ్య (70), మహేష్ (28) ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుమల వెళ్లి స్వామి వారికి మొక్కులు తీర్చుకుని తిరిగి సూర్యాపేట వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్‌పి వకుల్ జిందాల్, నల్లపాడు సిఐ వంశీధర్ సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఏపీలో రోడ్లు రక్తసిక్తం
- Advertisement -
- Advertisement -



