నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలోని పలు గ్రామాలు భారీ వర్షాల కారణంగా వరద తాకిడికి అతలాకుతలమవుతున్నాయి. రహదారులు మూసుకుపోతున్నాయి. మద్నూర్ మండలంలోని సోనాల, తడిఇప్పర్గా, గ్రామాల మధ్య రహదారిపైకి లేండి వాగు వరద నీరు వత్తుక వస్తుండడంతో బీటీ రోడ్డుపైన భారీగా వరద నీళ్లు నిలిచిపోయాయి. ఈ పరిస్థితిని పరిశీలించిన తహసిల్దార్ ఎంపీడీవో పోలీస్ శాఖ అగ్రికల్చర్ తదితర శాఖల అధికారులు అలాంటి అయ్యారు రహదారి గుండా ఏ ఒక్కరు వెళ్లకుండా దారిని మూసి వేయించారు. ఇది ఇలా ఉండగా.. డోంగ్లి మండల గ్రామాలైన లింబూర్ హసన్ టాక్లి గ్రామాల మధ్యగల వాగు పొంగిపొర్లడంతో రహదారిని మూసివేశారు.
ఈ విధంగా మద్నూర్ మండలం నుండి డోంగ్లి మండలానికి వెళ్లే రహదారులు మూసి వేయవలసిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయిన గ్రామాలకు ఎలాంటి ఆపద వచ్చినా ఇబ్బందులు పడవలసిందే. తడి ఇప్పర్గా లింబూర్ చిన్న టాక్లి పెద్ద టాక్లి సిర్పూర్ గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముందుగా గోజేగావ్ గ్రామానికి లేండి వాగు వరద మూలంగా రాకపోకలు నిలిచిపోగా .. మద్నూర్ మండలంలో వర్షం ఆగిపోయిన ఎగువనగల మహారాష్ట్రలో కురిసే వర్షాలకు దిగువన పారే వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు తగ్గేవరకు పలు గ్రామాలు రాకపోకలు జరగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద పెరిగినట్లు అయితే పలు గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లే ఆస్కారం కనిపిస్తోంది. దీని మూలంగా అధికారులు జలదిగ్బంధానికి గురయ్యే గ్రామాల ప్రజలకు ఎలాంటి సహాయాన్నికైనా సిద్ధంగా ఉన్నాం. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలని సూచిస్తున్నారు.