నవతెలంగాణ – కంఠేశ్వర్
నరేంద్ర మోడీ ప్రజా, కార్మిక ,రైతు వ్యతిరేక విధానాల నిరసిస్తూ ఈనెల 14న రౌండ్ టేబుల్ సమావేశం జయప్రదం చేయండి అని సీఐటీయూ, తెలంగాణ రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. శనివారం నిజామాబాద్ పట్టణంలోని నాందేవాడ సిఐటియు కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసా కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దివెంకట్రాములు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ లు మాట్లాడుతూ.. మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈనెల 14న నిజాంబాద్ పట్టణంలోని నాందేవాడ సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాము అన్నారు.
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లు మార్చి ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచి పెట్టుబడిదారులకు అనుకూలంగా సవరణ చేస్తున్నాడని అన్నారు. వ్యవసాయ రంగంలో మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతంగమంతా వ్యతిరేకించినప్పటికీ చట్టాల్ని రద్దు చేస్తున్నానని చెప్పి దొంగ చాటుగా అమలు చేస్తున్నాడని అన్నారు రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎం ఎస్ పి మద్దతు ధర కల్పించాలని, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ధాన్యానికి సుంకాలు వేయాలని మనదేశంలో పండించిన పత్తి ఇతర పంటలకు మద్దతు ధర కల్పించాలని వ్యవసాయ రంగానికి విద్యుత్తు సవరణ బిల్లులు సమరించుకోవాలని ఉపాధి హామీ పనికి నిధులు కేటాయించి కూలి వ్యవసాయ కూలీలందరికీ రోజుకు 600 కూలి వచ్చే విధంగా 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈనెల 14న జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


