- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బస్వపురం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి తిమ్మాపూర్, లప్పా నాయక్ తండాలోని పాత నిర్మాణాలకు పరిహారంగా రూ.100కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని శనివారం ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో నకిరెకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇతర ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, మందుల సామేల్ , బాలూ నాయక్ , బత్తుల లక్ష్మా రెడ్డి , జైవీర్ రెడ్డి , ఎడమ బొజ్జు పాల్గొన్నారు.
- Advertisement -