Monday, January 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుచేర్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్లు

చేర్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్లు

- Advertisement -

శంకుస్థాపనలు చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ – ఆలేరు

భువనగిరి పార్లమెంట్ పరిధిలో గల చేర్యాల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు 15 కోట్లు విలువైన పనులకు శంకుస్థాపన చేసినట్లు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అమృత్ పథకంలో భాగంగా సోమవారం పెద్ద చెరువు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులతో  మూడు కోట్ల తోపాటు చేర్యాల పట్టణంలో పలు అభివృద్ధికి మరో రూ.12 కోట్లుతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ .. చేర్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడమే  లక్ష్యమని పేర్కొన్నారు. చేర్యాల ప్రాంతంన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలు వ్యవస్థలో చాలా ముఖ్యమైనవని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -