శ్రీలంక క్రికెటర్‌కు ఐపీఎల్ కాంట్రాక్టు
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) నుంచి బయటకు వచ్చిన శ్రీలంక క్రికెటర్ రాజస్తాన్ రాయల్స్ కాంట్రాక్టు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ శామ్ కరణ్ గాయంతో ఐపీఎల్‌కు దూరమవగా.. అతడి స్థానంలో రాజస్తాన్ రాయల్స్ శ్రీలంక ఆల్‌రౌండర్ దసున్ శనకను తీసుకున్న సంగతి తెలిసిందే. కరణ్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ నుంచి ట్రేడింగ్‌లో తెచ్చుకున్న రాయల్స్.. దసున్ శనకకు రూ.2 కోట్లు ఇవ్వనుంది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనతో తెలిపారు. శనక శ్రీలంక తరఫున 6 టెస్టులు, 71 వన్డేలు, 131 టీ20లు ఆడాడు. గతంలో గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్‌లోనూ శనక బరిలో నిలిచాడు.



