Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పాఠశాలలో టేబుల్, కుర్చీ లా కొనుగోలు కు రూ.20వేల అందజేత...

పాఠశాలలో టేబుల్, కుర్చీ లా కొనుగోలు కు రూ.20వేల అందజేత…

- Advertisement -

– ఎల్లప్పుడూ సహకరిస్తా.. మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్..
నవతెలంగాణ – డిచ్ పల్లి

ఇందల్ వాయి మండలంలోని సిర్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాంసాగర్ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల  అభివృద్ధి కొరకు దర్పల్లి మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్ తనవంతుగా రూ.20,000 వేల రూపాయలను తండా పేల్చేందుకు సోమవారం అందజేశారు.ఈ సందర్భంగా ఇమ్మడి గోపి ముదిరాజ్ మాట్లాడుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఉత్తమంగా తీర్చిదిద్దుతుందని నేడు ఏ అధికారి చూసిన ఆనాడు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధన చేస్తున్నారని ప్రైవేట్ కు పిల్లలను పంపకుండా గ్రామంలో ఉన్న పాఠశాలను పిల్లలకు పంపిస్తూ రక్షించుకో బాధ్యత గ్రామస్తులపై తాండవాసులపై ఉందన్నారు. పాఠశాలకు అవసరమైన టేబుళ్లు కుర్చీలు కొనుగోలు చేసుకోవడానికి తన వంతుగా 20000 అందజేస్తున్నానని లేని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాండకు ఎలాంటి కార్యక్రమాలు చేసిన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తన వంతుగా సహాయ సహకారాలు అందజేస్తారని వారికి ఇచ్చారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు దామ సుమన్, రోహిత్ గౌడ్, నల్లవెల్లి మాజీ సర్పంచ్ ఎడ్ల శ్రీనివాస్,సిర్న పల్లి మాజీ సర్పంచ్ నవీన్ గౌడ్, తండా వాసులు లింగయ్య నాయక్ ,గణేష్ నాయక్, పాఠశాల అధ్యాపకులు జీ తిరుపతి అంగన్వాడి టీచర్ మమత తో పాటు తాండవాసులు పాల్గొన్నారు. పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad