నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలోని మంథని-అరేంద మానేరుపై మీదుగా దామెరకుంట వరకు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఆర్ అండ్ బి శాఖ నుండి రూ.203 కోట్ల నిధులను మంజూరు చేసినట్లుగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు శనివారం ఒక ప్రకటనలో ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మంథని మండలములోని ఆరెంద మీదుగా దామెరకుంట వరకు 1.120 మీటర్ల పొడవు 13 మీటర్ల వెడల్పుతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి, ఆరెంద, మల్లారం, వెంకటాపూర్ నుండి బ్రిడ్జి వరకు అటు సైడు దామేరకుంట రోడ్డు వరకు 9.530 మీటర్ల అప్రోచ్ రోడ్డుకు రూ.203 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్అండ్ బి శాఖ ద్వారా మంజురైనట్లుగా తెలిపారు.
మంథని మండల ప్రజలు, ఇతర మండలాల ప్రజలు మానేరు బ్రిడ్జి దాటి ఇతర జిల్లాలకు, మహారాష్ట్రకు, కాలేశ్వరం దేవాలయానికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఇతర ప్రదేశాల ప్రజలకు సౌకర్యాలు ఉంటాయన్నారు. మంథని, పెద్దపల్లి జిల్లా వారికి కాలేశ్వరం వెళ్ళడానికి 25 కిలోమీటర్ల వరకు దూరం తగ్గుతుందని తెలిపారు. కాలేశ్వరం టూరిజం డెవలప్మెంట్ కూడా పెరుగుతుందని, మహారాష్ట్ర ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి చాలా వీలు ఉంటుందని వెల్లడించారు.
జయశంకర్ భూపాలపల్లి కాటారం వెళ్లడానికి వీలు ఉంటుందని, ఆరెంద, మల్లారం, వెంకటాపూర్, దామేరకుంట ఈ గ్రామాలలో ప్రజలకు రవాణా పరంగా వైద్య, విద్య పరంగా చాలా ఉపయోగపడుతుంది అన్నారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. మానేరు పై బ్రిడ్జి అరెంద మీదుగా దామెరకుంట నిర్మాణానికి రూ.203 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల, ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.



