Saturday, July 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలురూ. 344 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల

రూ. 344 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల

- Advertisement -

– సెర్ప్‌ ఖాతాలో జమచేసిన ఆర్థిక శాఖ
– నేటి నుంచి 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో డబ్బులు: చెక్కుల పంపిణీలో పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర సర్కారు మహిళా సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు రూ.344 కోట్ల వడ్డీలేని రుణాలను విడుదల చేసింది. అందులో నుంచి గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు రూ.44 కోట్లు కేటాయించింది. ఆ నిధులను సెర్ప్‌ ఖాతాల్లో ఆర్థిక శాఖ జమ చేసింది. శనివారం నుంచి ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. వాటికి సంబంధించిన చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు మంత్రులు, ఎమ్మెల్యేలు అందజేయనున్నారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులకు ప్రమాదబీమా, లోన్‌బీమా చెక్కులను సైతం వారు ఇవ్వనున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వడ్డీలేని రుణాలను ఇవ్వని సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌ సర్కారు మొత్తంగా రూ.3 వేల కోట్లకుపైగా వడ్డీలేని రుణాలను పెండింగ్‌లో పెట్టింది. కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వడ్డీలేని రుణాల చెల్లింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ప్రతి మహిళా సంఘంలోని సభ్యురాలిని లక్షాధికారిగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. మహిళా సంఘాలకు నిధులను ఇప్పించడంలో మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ(సీతక్క) ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -