– గాంధీ అంతకులు దేశద్రోహులు
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్
నవతెలంగాణ – కామారెడ్డి
అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి గాంధీ గంజ్ లో ఉన్న విగ్రహానికి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను అర్పించిన అనేకమంది సమరయోధులతో పాటు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన తన పద్ధతిలో సత్యాగ్రహ దీక్షలో అహింసా మార్గం, క్విట్ ఇండియా ఉద్యమం లాంటి పోరాటాలతో బ్రిటిష్ వారిపై దేశ ప్రజలందరూ ఉద్యమంలో పాల్గొనేలా ప్రజలను ఉత్తేజపరిచి దేశానికి స్వాతంత్రం రావడానికి ముఖ్య పాత్ర పోషించిన మన జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. బుధవారం వందరోజుల పండగ జరుపుకున్న ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాలు మహాత్మా గాంధీ హంతకుడిని దేవుడిలాగా గాంధీని దేశద్రోహి లాగా చిత్రించే కుట్రలు చేస్తున్నారన్నారు.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో ఎవరు పాల్గొనకూడదని ఆర్ఎస్ఎస్ హుకుం జారీ చేసిన వారి నాయకత్వం, స్వాతంత్ర పోరాటంలో అనుకోకుండా అరెస్టయి జైలుకెళ్లిన సావర్కర్ బ్రిటిష్ వారికి క్షమాభిక్ష ఉత్తరం రాసి వారిచ్చే పెన్షన్ డబ్బులు తీసుకొని బ్రిటిష్ పాలకులకు అనుకూలంగా నడవడం అనేది చరిత సత్యం అని పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోడీ ఒకవైపు గాంధీ మహాత్మునికి నివాళులర్పిస్తూనే మరోవైపు గాంధీ హంతకుడైన గాడ్సే కు గుడి కట్టి ముక్కడమనేది రెండు నాలుకల ధోరణి అని అన్నారు.
సోషల్ మీడియా వేదికగా మహాత్మా గాంధీని కించపరుస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ ఐటి సెల్ విభాగాన్ని గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ ను ఏ విధంగా నిషేధించారో అలాగే నిషేధించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా యువత ఏదైతే గాంధీ మహాత్ముని పై జరుగుతున్న చెడు ప్రచారాన్ని నమ్మకూడదని చెడు ప్రచారం చేసే వారెవరైతే ఉన్నారో వాళ్లు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదని అన్నారు. మహాత్మాకు చూపిన అహింస మార్గం, పోరాట మార్గం ఏదైతే ఉందో దాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సత్యం, శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.