నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాదు నుంచి బోరిగాం,మోపాల్,కులాస్ పూర్, ముల్లంగి,నుండి ఘన్ పూర్ వరకు ఆర్టీసీ బస్సు నడపాలని పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రీజినల్ మేనేజర్ టి .జోష్న కి పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ నుండి మోపాల్, కులాస్ పూర్, కులాస్ పూర్ తండా,ముల్లంగి నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నారని, నిజాంబాద్ నుంచి వచ్చే బస్సు ముల్లంగి వరకే నడుపుతున్నారని ముల్లంగి నుండి జూనియర్ కళాశాల వరకు రెండు కిలోమీటర్ల పైగా నడిచి వెళ్లడం జరుగుతుందని విద్యార్థులు ఉదయం పూట క్లాసులు కోల్పోతున్నారని తెలిపారు.
అదనపు ఆర్థిక భారం విద్యార్థులు భరిస్తున్నారని, సాయంత్రం వేళల్లో కూడా ముల్లంగి వరకు నడిచి వెళ్తున్నారని, అమ్మాయిలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గతంలో ఎన్ని సార్లు విన్నవించిన విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆదేదన వ్యక్తవ చేశారు. కావున ముల్లంగి వరకే కాకుండా ఉదయం సాయంత్రం ఘన్పూర్ జూనియర్ కళాశాల వరకు వరకు బస్సు నడపాలని డిమాండ్ చేశారు. రీజినల్ మేనేజర్ కూడా వినతి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నగర నాయకులు సాయికిరణ్ , ప్రసాద్,ప్రసాద్, ఇస్మాయిల్, పవన్, వినీల్,శ్రవణ్,యశ్వంత్, సాయి కుమార్, రోహన్, భాను,చంద్ర, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఘన్పూర్-ప్రభుత్వ జూ.కళాశాల వరకు ఆర్టీసీ బస్సు నడపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES