నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలోని జనరల్ బస్ పాస్ దారులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రూ.20 ధరకే ‘మెట్రో కాంబి టికెట్’ కాంబినేషన్ టికెట్‌తో మెట్రో డీలక్స్ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును కల్పించింది. దీంతో మెట్రో బస్‌పాస్, సాధారణ (జనరల్ బస్‌పాస్) నెలవారీ బస్ పాస్ ఉన్నవారు హైదరాబాద్ అంతటా మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించొచ్చు. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఈ వివరాలను ట్వీట్ చేశారు.
- Advertisement -