డాలర్‌కు 29 పైసలు క్షీణించి రూ.94.05
న్యూఢిల్లీ : భారత కరెన్సీ మరో చారిత్రాత్మక పతనాన్ని నమోదు చేసింది.పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు రూపాయి విలువను క్షీణించేలా చేస్తోన్నాయి. బుధవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 29 పైసలు క్షీణించి 94.05 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ రూపాయికి మాత్రం ఉపశమనం లభించలేదు. నెల చివరిలో డాలర్లకు పెరిగిన డిమాండ్, భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆర్‌బీఐ, మోడీ సర్కార్ ఇప్పటికైనా జోక్యం చేసుకుని రూపాయి విలువను కనీసం 94 స్థాయి వద్ద అయినా కాపాడాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.



