Saturday, July 5, 2025
E-PAPER
Homeసినిమారూరల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌

రూరల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా ఈసారి ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అనే రూరల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తోంది. నటి, నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్‌ నిర్మించిన ఈ చిత్రం పల్లెటూరి జీవితాన్ని, సరదాలని అద్భుతంగా చూపించనుంది. తాజాగా ఈచిత్ర టీజర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. గాసిప్‌తో సందడి చేసే పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రమిది. మనోజ్‌ చంద్ర రికార్డ్‌ డ్యాన్స్‌ స్టూడియోని నడుపుతున్న యువకుడిగా కనిపించాడు. అతను డ్యాన్స్‌ పార్ట్నర్‌ కోసం వెదుకుతున్నప్పుడు ఊహించని సమస్యలలో చిక్కుకుంటాడు. రిఫ్రెష్‌గా ఉండే రస్టిక్‌ టోన్‌లో కొత్తపల్లి ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్‌ పెట్రోస్‌ ఆంటోనియాడిస్‌ గ్రామీణ జీవితాన్ని అద్భుతంగా చూపించాడు. మణిశర్మ సంగీతం సమకూర్చగా, వరుణ్‌ ఉన్ని అందించిన నేపథ్య సంగీతం టీజర్‌లో ఫన్‌ని ఎలివేట్‌ చేసింది. ఈ చిత్రంలో మోనికా టి, ఉషా బోనెల కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. వీరి పెర్ఫార్మెన్స్‌ చాలా నేచురల్‌గా ఆకట్టుకున్నాయి. గురుకిరణ్‌ బత్తుల కథ, సంభాషణలను అందించారు. డైరెక్టర్‌ ప్రవీణ పరుచూరి నెరేటివ్‌కి చక్కని సున్నితత్వాన్ని తీసుకువచ్చారు. టీజర్‌ అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం జూలై 18న థియేటర్లలో విడుదల కానుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -