హెచ్‌ఎన్‌జి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సఃకుటుంబానాం’. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, తదితరులు కీలకపాత్రలు పోషించారు. మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించిన ఈ చిత్రం ఈనెల 1వ తేదీన విడుదలైన నూతన ఏడాదిలో మొదటి హిట్‌గా నిలిచిన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ వేడుకను వైభవంగా నిర్వహించింది. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ‘ఇలాంటి మంచి సినిమాను ఆదరించి హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్రేక్షకులంతా కుటుంబసభ్యులతో కలిసి చూసి ఆనందిస్తున్నారు. థియేటర్లు పెరుగుతున్నాయి అంటే సినిమా ఎంత విజయం సాధించిందో అర్థం అవుతుంది’ అని తెలిపారు. ‘ఈ 2026 తొలి హిట్‌గా మా చిత్రం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని దర్శకుడు ఉదయ్ శర్మ చెప్పారు. నిర్మాత మహదేవ్ గౌడ్ మాట్లాడుతూ, ‘మా సినిమాను ఆదరించి మంచి హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా తొలి చిత్రానికి సపోర్ట్ చేస్తూ నటించిన రాజేంద్ర ప్రసాద్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. మరికొన్ని థియేటర్లు పెరుగుతున్నాయి’ అని అన్నారు.
‘సఃకుటుంబానాం’కు విశేష ప్రేక్షకాదరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



