నవతెలంగాణ – మిరుదొడ్డి
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. మిరుదొడ్డి మండలంలోని లింగుపల్లి, మల్లుపల్లి, అల్వాల, మిరుదొడ్డి, అందే ,కొండాపూర్ తో పాటు పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. అత్తవారింటి నుండి ఆడపడుచులు తల్లిగారింటికి వచ్చి కొత్త దుస్తులను ధరించి రంగురంగుల చీరల కట్టుకుని బతుకమ్మలు ఆడుతుంటే ఒకరికొకరు పోటాపోటీగా గంటల తరబడి పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహిళలు ఆడపడుచులు చిన్నారులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను తయారు చేసి వాడవాడల నుండి ర్యాలీగా బయలుదేరి ఒకే చోట బతుకమ్మలు పెట్టుకొని ఘనంగా సంబరాలు అంబరాన్ని అంటే విధంగా బతుకమ్మ పండుగను నిర్వహించుకున్నారు. ఈ యొక్క పండుగలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES