- Advertisement -
నవతెలంగాణ – నిజాంసాగర్
మన తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేసే గొప్ప పండుగ బతుకమ్మ. మంగళవారం సద్దుల బతుకమ్మ సంబరాలను మండలంలోని పలు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. మహిళలు ఎంతో ఆనందంగా బతుకమ్మ అని పాడుతూ తెలంగాణ సంస్కృతి గౌరవాన్నీ పాట రూపంలో తెలియజేశారు. ఉదయం నుంచే మహిళలు పూలను సేకరించడం, వాటిని అలంకరించడం లాంటి పనులు చేసి సాయంత్రం సమయంలో మహిళలు, యువతిలు ఒకచోట చేరి పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరిగి బతుకమ్మ ఆడారు. సాయంత్రం సమయంలో బతుకమ్మలను సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో నాయకులు పెద్ది హన్మండ్లు, బాల్ రెడ్డి, కురుమ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -