సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ చిత్ర మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘సఖీ..’ పాటని రిలీజ్ చేశారు. కంపోజర్ జ్ఞానీ ఈ పాటని ఎప్పటికీ నిలిచిపోయే ఫ్రెండ్షిఫ్ సాంగ్‌గా స్వరపరిచారు.
అనంత శ్రీరాం రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి. లక్ష్మీ మేఘన వాయిస్ పాటకు మరింత మాధుర్యాన్ని జోడించింది. లిరికల్ వీడియో ఆకట్టుకునే భావోద్వేగాలను, మ్యూజికల్ ట్రీట్‌ని అందిస్తుంది.
ఈ చిత్రానికి కథ, దర్శకత్వం: అభినయ కష్ణ, నిర్మా తలు: వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్, డీఓపీ : రమేష్ కుశేందర్ రెడ్డి, క్రియేటివ్ డైరెక్టర్: రిషాన్, సంగీతం: గ్యాని, ఎడిటర్: వరప్రసాద్, ఆర్ట్: భూపతి యాదగిరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీహరి గౌడ్.
స్నేహానికి నిర్వచనంగా ‘సఖీ..’
- Advertisement -
- Advertisement -



