- Advertisement -
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.2,12,965 వచ్చినట్లు ఆలయ అధికారి వేణు బుధవారం విలేకరులకు తెలియజేశారు. ఈ హుండీ లెక్కింపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు హుండీ తెరిచినట్లు అధికారి తెలిపారు.
ఈ లెక్కింపులో జిల్లా శాఖ అధికారులు ఆలయ అధికారులు మద్నూర్ మండలంలోని వివిధ ఆలయాలకు చెందిన ధూప దీప నైవేద్య అర్చకులు డబ్బులను లెక్కించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఆలయ కమిటీ సభ్యులు ధూప దీప నైవేద్య అర్చకుల సంఘం జిల్లా అధ్యక్షులు అంజన్ అప్ప, భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



