- Advertisement -
శూన్యం నుండి సృష్టి అల్లిన
మొదటి సంతకం ఆమె..
కాలం కదులుతున్న కొద్దీ
మారే అద్భుత దృశ్యకావ్యం ఆమె!
కన్నీటి చుక్కలో సముద్రమంత ఓర్పు,
చిరునవ్వు వెనుక ఆకాశమంత ధైర్యం.
అణిచివేతను చీల్చుకుని వచ్చే
ఓ మొండి మొలక ఆమె!
ఆమె పరిమితులకు అందని పరిధి,
బలహీనత అర్థాన్నే
మార్చేసిన మహా శక్తి.
తను – కేవలం ఒక రూపం కాదు,
చరిత్రను రాసుకుంటున్న వర్తమానం.
లోకం చుట్టే గీతలను దాటుతూ
అవకాశాల ఆకాశాన్ని అందుకుంటూ
తన అస్తిత్వాన్ని తనే
ఆవిష్కరించుకునే నవశక్తి.
వందనం… అభివందనం
శోధనలో గెలుపు సాధనలో
శ్రమిస్తున్న ‘ఆమె’ కు
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి,
- Advertisement -



