Tuesday, July 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా సంపత్ రావు

ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా సంపత్ రావు

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
ట్రస్మా (తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడుగా మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామానికి చెందిన విరమనేని సంపత్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం కాటారంలోని వివేకానంద స్కూల్లో ఈ ఎన్నికలు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి,ప్రధాన కార్యదర్శి నడిపెళ్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ  ఎన్నికల్లో భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా వీరమనేని సంపత్ రావు,ఉపాధ్యక్షులు గా బొడేటి మంజుల రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా జనగామ కార్తీక్ రావు,సహాయ కార్యదర్శిగా కుదుడుల రాజు,కోశాధికారిగా జాటోత్ నవీన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా అద్యక్షుడు సంపత్ రావు మాట్లాడారు పాఠశాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.తన ఎన్నికకు సహకరించిన ప్రయివేటు పాఠశాలలు యజమాన్యాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా నాయకులు అదెపు శ్యాం, ముక్కెర రవిందర్, బిల్ల రవి, కోదం సంజీవరెడ్డి, అబ్బా కేశవరెడ్డి, డానియల్ రాజు తోపాటు పలు పాఠశాలల కరెస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -