నవతెలంగాణ – నవాబు పేట
మండల పరిధిలోని కారూర్ సమీపంలో ఉన్న దుందుభి నదిలో కోటి రూపాయలకు పైగా నిధులతో నిర్మించిన చెక్ డ్యాం రెండుగా చీలిపోయింది. వాగులో వంకలలో నిర్మించిన విలువైన వంతెనలు చెక్ డ్యాం లు ఇసుక మాఫియా సాగిస్తున్న ఆగడాల వల్ల శాశ్వత నిర్మాణాలు కూడా శిథిలమవుతున్నాయి అని చుట్టుపక్కల ప్రజలు మండిపడుతున్నారు. నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పరిరక్షించేందుకు కోసం ప్రభుత్వం వాటర్ షెడ్ పథకం ద్వారా పలు రకాల అభివృద్ధి నిధుల ద్వారా నిర్మించిన వాగులు వంకల్లో చెక్ డ్యాంలకు భద్రత లేకుండా పోయింది. ఇసుకాసురులు వాటి చెంతనే లోతుగా ఇసుక త్రవ్వకాలు జరిపి సొమ్ము చేసుకోవడంతో అవి శిథిలమవుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండల పరిధిలోని కారూరు గ్రామ సమీపంలోని వాగులో గల చెక్ డ్యాం సోమవారం శిథిలమైంది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని ప్రజలు విమర్శిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
కారూర్ వాగులో ఇసుక మాఫియా.. ఆగడాలకు చెక్ డ్యాం బలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES