Monday, May 12, 2025
Homeతెలంగాణ రౌండప్కులమతాలకు అతీతంగా ఖండేబల్లుర్ లొ సంధాల్...

కులమతాలకు అతీతంగా ఖండేబల్లుర్ లొ సంధాల్…

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
కుల మతాలకు అతీతంగా ఖండేబల్లుర్ గ్రామంలో ముస్లిం సోదరులు ఆదివారం నాడు సంధాల్ నిర్వహించారు . అంతకుముందు గ్రామంలో ఉదయం నుండి మాహ అన్న ప్రసాదం నిర్వహించి గ్రామస్తులందరికీ దావత్ ఇచ్చారు. అనంతరం గ్రామ పెద్దల ఇంటి నుండి నూతనంగా ఏర్పాటు చేసిన దర్గాకు చాదర్, పువ్వులు కప్పడానికి నృత్యాలు చేస్తూ తీసుకెళ్లడం జరిగింది. అనంతరం అక్కడ పూజలు నిర్వహించి చాదరు కప్పి పువ్వులను పరిచి దర్గాను దర్శించుకోవడం జరిగింది. సంధాల్ కు గ్రామమంతా కులమతాలకతీతంగా తరలివచ్చి పండుగ వాతావరణం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సాయంత్రం ఖవ్వాలీ కార్యక్రమం ఉంటుందని , ప్రతి ఒక్కరూ  ఖవ్వాలి కార్యక్రమం వినేందుకు వచ్చి కార్యక్రమం విజయవంతం చేసేందుకు గ్రామస్తులంతా పాల్గొనడం జరిగింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -