Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రెస్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షునిగా సందూర్వార్ హనుమాన్లు

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షునిగా సందూర్వార్ హనుమాన్లు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షునిగా సందూర్ వార్ హనుమాన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ ఎన్నిక కోసం మండల విలేకరులందరూ శుక్రవారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఎన్నికైనట్లు ఎన్నిక పత్రాన్ని రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సంఘ అయ్యప్ప నూతన అధ్యక్షునికి అందజేస్తూ స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికైన సందూర్ వార్ హనుమాన్లు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల తరబడి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకుండా జర్నలిస్టులకు అందవలసిన ఇండ్ల స్థలాలు ఇండ్ల మంజూరు, ముఖ్యమైన సమస్య పరిష్కారం కోసం తనవంతు కృషి తప్పకుండా చేస్తానని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు.

మద్నూర్ మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షునిగా సందుర్వార్ హనుమాన్లు, ఉపాధ్యక్షులుగా మస్కల్ వార్ శివాజీ ప్రధాన కార్యదర్శిగా కర్రే వార్ బాలు, జాయింట్ సెక్రెటరీగా ఆకులవార్ పండరి, కోశాధికారిగా పాలేకర్ నాగేష్ గౌడ్, కమిటీ సభ్యులుగా వడ్డేవార్ నవనీత్, సుంకి వార్ శ్రీధర్, సందులవార్ సాయి, సోపాన్ దొంతులవార్, సలహాదారులుగా, సంఘయప్ప, ఆర్మూర్ వార్ హనుమాన్లు, రఘు ,రామ్మోహన్రావు, కృష్ణ పటేల్, ఆర్ సుభాష్ ,ఎన్నికయ్యారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad