Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగాపూర్ లో పారిశుధ్య కార్యక్రమాలు

నాగాపూర్ లో పారిశుధ్య కార్యక్రమాలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని నాగపూర్ లో శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని పురస్కరించుకొని పరిశుద్ధ కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలోని పలు కాలనీల్లో పరిశుద్ధ కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా కాలనీలో పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కలను బ్లేడ్ ట్రాక్టర్ ద్వారా తొలగింపజేసి చదును చేయించారు. గ్రామంలో ఫ్రైడే ఫ్రైడే సందర్భంగా చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను మండల పంచాయతీ అధికారి సదాశివ్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన పంచాయతీ కార్యదర్శి సంధ్య, గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆయన పలు సలహాలు సూచనలు చేశారు. వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా గ్రామపంచాయతీ ద్వారా తగిన చర్యలు చేపట్టాలన్నారు. మురికి కాలనీ ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని సూచించారు. నీటిమడుగులలో దోమలు వృద్ది చెందకుండా దోమల లార్వాని  చంపేందుకు ఆయిల్ బాల్స్ గ్రామ పంచాయతీ సిబ్బందితో వేయించాలన్నారు. ఇండ్లలో  పాడైన వస్తువుల్లో నీటి నిల్వ ఉంచుకోకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -