నవతెలంగాణ – అచ్చంపేట
వర్షాకాలం నేపథ్యంలో హాస్టల్స్, స్కూల్స్ లో శానిటేషన్ మెరుగుపరచుకోవాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు తప్పకుండా పౌష్టిక ఆహారం అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ అన్నారు. మంగళవారం అచ్చంపేటలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఈఓ రమేష్ కుమార్, ఎస్సీ కార్పోరేషన్ ఈడి, జిల్లా అధికారులతో కలసిగురుకుల హాస్టల్స్ వార్డెన్లు, ప్రిన్సిపాల్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలని, వార్డెన్ తప్పనిసరిగా హాస్టల్ ఆవరణలోనే నివాసం ఉండాలన్నారు. గురుకులాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
అచ్చంపేట నియోజకవర్గంలోని సంక్షేమ హాస్టల్స్, రెసిడెన్షియల్ గురుకులాలో పారిశుధ్య నిర్వహణ, విద్యార్థులకు అందించే ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గురుకులాల్లో, సంక్షేమ హాస్టల్లో ఎక్కడా డార్క్‌ఏరియా ఉండవద్దని, ప్రతిచోట లైట్ ఉండాల ని తెలిపారు. తాగునీటి సరఫరా నాణ్యతను పరి శీలించాలన్నారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంట నే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. హాస్టల్స్ పరిస రాలలో ఎక్కడైనా పాములు, తేళ్లు ఉండకుండా పరిశీలించాలని, ఒకవేళ ఎక్కడైనా గుర్తిస్తే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రస్తుతం వైరల్ జ్వరాల వ్యాప్తి అధికంగా ఉన్న నేప థ్యంలో విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏఎన్‌ఎంల ద్వారా విద్యార్థులకు అవసరమైన పరీక్షలు నిర్వ హించాలన్నారు. పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఆహారం తీసుకునే ముందు, బాత్‌రూం వినియోగించిన తర్వాత చేతుల ను విద్యార్థులు తప్పనిసరిగా శుభ్రం చేసుకునేలా చూడాలని సూ చించారు. విద్యా ర్థులకు అందించే ఆహారం వేడిగా ఎప్పటికప్పుడు తయారు చేసి అందించాలని, నిల్వ ఉంచిన భోజనం పెట్టవద్దని ఆదేశించారు.
ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు జరిగితే సంబందించిన అధికారుల పై కఠినంగా వ్యవహరిస్తామని, ప్రిన్సిపాల్స్, హస్టల్ వార్డెన్‌లు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రిన్సిపల్ లు,వార్డెన్ లో ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.