Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పారిశుధ్య కార్మికుల సిఐజి గ్రూపులలో యధావిధిగా కొనసాగించాలి 

పారిశుధ్య కార్మికుల సిఐజి గ్రూపులలో యధావిధిగా కొనసాగించాలి 

- Advertisement -

– వరకు కాంట్రాక్ట్ 331 మంది కార్తికేయ ఏజెన్సీ కార్మికులను 35 నుండి 50 చొప్పున గ్రూపులలో చేయాలి 
– కమిషనర్ కు విన్నవించిన సిఐటియు, ఏఐటియుసి, టి యు సి ఐ సంఘాలు 
నవతెలంగాణ కంఠేశ్వర్ : మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సిఐజి గ్రూపులలో యధావిధిగా కొనసాగించాలి అని, వరకు కాంట్రాక్ట్ 331 మంది కార్తికేయ ఏజెన్సీ కార్మికులను 35 నుండి 50 చొప్పున గ్రూపులు చేయాలి అని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ కు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఓమయ్య, టి యు సి ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య విభాగం అవుట్సోర్సింగ్ కార్మికులు ఇప్పటికే సిఐజి గ్రూపులుగా పనిచేస్తున్నారు. కేవలం వర్క్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న 331 మంది కార్మికులు కార్తికేయ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్నారు. వీరిని మాత్రమే 35 నుండి 50 మంది కార్మికులను గ్రూపులుగా చేస్తే సరిపోతుందని భావిస్తున్నామన్నారు. పాత సిఐజి గ్రూపులను మళ్లీ గ్రూపులుగా 10 నుండి 15 మంది చొప్పున చేస్తే సమస్య మరింత జటిలమవుతుంది పైగా ఇప్పటికే కొనసాగుతున్న సిఐజి గ్రూపులో ఏ ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాయి వీటిని కదపటం ఈ రకంగా సరైనదని తెలియజేస్తున్నామన్నారు. అందువల్ల కార్తికేయ ఏజెన్సీ వాటర్ వర్క్స్ డ్రైవర్స్ ను మాత్రమే 35 నుండి 50 మంది గ్రూప్లో చేయాలని పాత సిఐజి గ్రూపులను యధావిధిగా కొనసాగించాలని కోరుతున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -