- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ ఎస్పై విజయ కొండను ఆదివారం కాంగ్రెస్ నాయకులు సంతోష్ మేస్త్రీ సన్మానం చేశారు. ఇటీవల జరిగిన కరీంనగర్ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా రెండు వెండి పతకాలు సాధించిన ఎస్ఐకి శాలువాతో కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలా ఎన్నో పథకాలను సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతూ ఎస్ఐకి అభినందించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ మేస్త్రి, సోమావార్ మహేష్, దిగంబర్, తదితరులు ఉన్నారు.
- Advertisement -