Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డి కాంగ్రెస్ జిల్లా సెక్రెటరీగా సంతోష్ పటేల్  

కామారెడ్డి కాంగ్రెస్ జిల్లా సెక్రెటరీగా సంతోష్ పటేల్  

- Advertisement -

నవతెలంగాణ- మద్నూర్ 
మద్నూర్ మండలంలోని కొడిచరా గ్రామ మాజీ సర్పంచ్ పోశెట్టివార్ సంతోష్ పటేల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ నా పైన నమ్మకంతో ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవ జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావుకు, అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జునరావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఐ కమాండ్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికైన సందర్భంగా జిల్లా ప్రజలకు మద్నూర్ మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఉగాది పర్వదినం అలాగే రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -