- Advertisement -
నవతెలంగాణ – రాజపేట
రాజాపేట మండల కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం కూడలి వద్ద శుక్రవారం బిజెపి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. భారతదేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజపేట ఎస్సై అనిల్ కుమార్, ఏఎస్ఐ ప్రకాష్, యాదయ్య, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు నమిల రమేష్, యువకులు నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -

 
                                    