- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి(జాతీయ ఐక్యత దినోత్సవం) సందర్భంగా సర్దాపూర్ లోని 17వ బెటాలియన్ లో బెటాలియన్ కమాండెంట్  ఎం.ఐ. సురేష్  సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు. అనంతరం బెటాలియన్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది చేత  కమాండెంట్  సురేష్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జె. రాందాస్, ఎస్. సురేష్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -

 
                                    