నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన కే.సరిత మండల ఉత్తమ అంగన్వాడీ టీచర్ గా అవార్డును అందుకున్నారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జి.ఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ, ఆక్స్ ఫర్డ్ హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళల దినోత్సవం వేడుకలను నిర్వహించారు.
ఈ వేడుకల్లో మండల ఉత్తమ అంగన్వాడి టీచర్గా ఎంపికైన సరిత అతిథుల చేతుల మీదుగా అవార్డును పొందారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ మేయర్ ఉమారాణి, ప్రత్యేక అతిథులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, కామారెడ్డి జిల్లా టిజిఎన్ పిడిసిఎల్ ఎస్ఇ రవీందర్, జిల్లా వెల్ఫేర్ అధికారిని పద్మ, తదితరుల చేతుల మీదుగా సరిత మండల ఉత్తమ అంగన్వాడీ టీచర్ గా ప్రశంస పత్రంతో పాటు జ్ఞాపికను అందుకున్నారు. ఉత్తమ అంగన్వాడి టీచర్ గా అవార్డు అందుకున్న సరిత ను అతిథులు అభినందించారు.
ఈ సందర్భంగా అవార్డు పొందిన అంగన్వాడీ టీచర్ సరిత మాట్లాడుతూ తనకు అవార్డు రావడానికి సహకరించిన ఐసిడిఎస్ జిల్లా పిడి, భీంగల్ సిడిపివో, మండల సూపర్వైజర్, తోటి అంగన్వాడి టీచర్లకు కృతజ్ఞతలు తెలిపారు.



