Friday, February 13, 2026
E-PAPER
Homeకరీంనగర్ఘనంగా సరోజినీ నాయుడు జయంతి

ఘనంగా సరోజినీ నాయుడు జయంతి

- Advertisement -

నవతెలంగాణ – రాయికల్
పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సరోజినీ నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంగ్ల భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, పోస్టర్ తయారీ, ప్రశ్నోత్తర పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు మాట్లాడుతూ.. సరోజినీ నాయుడు స్వాతంత్ర్య సమరయోధురాలు, ప్రతిభావంతమైన కవయిత్రి అని కొనియాడారు. ఆమెకు మహాత్మా గాంధీ “నైటింగేల్ ఆఫ్ ఇండియా”గా గుర్తింపు ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -