- Advertisement -
నవతెలంగాణ (వేల్పూర్ )ఆర్మూర్
మండలంలోని మోతే ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మోతే గ్రామ సర్పంచ్ రమేష్ రెడ్డి, ఉప సర్పంచ్ పరంజ్యోతి మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసి పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని చక్కగా అందిస్తున్నందుకు మధ్యాహ్న భోజన సిబ్బందిని అభినందించి ప్రతిరోజు అదే విధంగా నాణ్యమైన పౌష్టికారమైన ఆహారాన్ని విద్యార్థులకు రాగిజావను అందించాలని కోరారు. పాఠశాల ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయులు మంచే గణేష్, ఉపాధ్యాయులు మహేందర్, రత్నయ్య, వెంకట నరసయ్య, కవిత, నవనిత తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



