Wednesday, March 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్, ఉపసర్పంచ్

తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్, ఉపసర్పంచ్

- Advertisement -

హర్షం వ్యక్తం చేసిన వార్డు ప్రజలు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీ పరిడీలోగల 1వ వార్డులో గత కొన్నేళ్లుగా తాగునీటి సమస్యను పలుమార్లు గత పాలకుల, సంబంధించిన అధికారులు దృష్టికి తీసుకపోయిన స్పందన లేదని ప్రజలు తెలిపారు. ప్రస్తుతం సర్పంచ్ కొండ రాజమ్మ, ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ దృష్టికి తీసుకవచ్చారు. వెంటనే స్పందించిన సర్పంచ్, ఉపసర్పంచ్ గురువారం సమస్యను జీపీ సిబ్బందితో పైప్ సైన్ సరిచేసి ఏడేళ్లుగా పరిస్కారం కానీ సమస్యను పరిస్కారం చేశారు. ఇందుకు అ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మధుసూదన్, లక్ష్మి,రవళి, శేషి, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -