Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అత్తామామల జ్ఞాపకార్ధం షెడ్డు నిర్మించిన సర్పంచ్

అత్తామామల జ్ఞాపకార్ధం షెడ్డు నిర్మించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఉషా సంతోష్ తమ అత్త మామలు పార్వతి బాయి, ఉల్లాజీ జ్ఞాపకార్థం తహశీల్దార్ కార్యాలయ ఆవరణంలో ప్రజల సౌకర్యం షెడ్డు నిర్మించారు. ఇందుకోసం కోసం దాదాపు రూ. 2 లక్షల సొంత నిధులను ఖర్చు చేశారు. పూల మొక్కల కోసం షెడ్డు ఆవరణంలో కుండీల ఏర్పాటు చేశారు. ఆదివారం సర్పంచ్ దంపతులు షెడ్డులోని మొక్కలకు నీరు పొశారు. ఈ సందర్భంగా నిత్యం తహశీల్దార్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు సర్పంచ్ పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -