నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం బసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సర్పంచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన వాటి నుంచి గ్రామంలో నెలకొన్న సమస్యలను దృష్టి సారించారు. ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి బసిరెడ్డి నుంచి శిరసనగండ్ల రోడ్డు, బసిరెడ్డిపల్లి నుంచి బట్టుగూడెం వెళ్లే రోడ్డు వరకు రోడ్ల కు ఇరువైపులా కంపచెట్లు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్ తుడుం శ్రావణి-రాకేష్ మంగళవారం జేసీబీ తో రోడ్లకు ఇరువైపులా పెరిగిన కంపచెట్లను తొలగించటం మొదలుపెట్టారు.
సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామంలో మంచినీటి సౌకర్యం, పాఠశాలలో నెలకొన్న సమస్యలు, మురుగు కాలువ నిర్మాణం వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించినట్టు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రావుల విజయ రమేష్, గ్రామ కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి, వార్డ్ మెంబర్లు ఈగల జయమ్మ, ఐతపోయిన పద్మ,గోగు శ్రీరాములు,ఇసురాజు అనిల్,వంగూరి లింగయ్య,గ్రామస్తులు చిమట కృష్ణయ్య, నడ్డి శ్రీను,రేవెల్లి కృష్ణయ్య,అనుముల ఆంజనేయులు, కన్నెబోయిన పరమేష్,అయితబోయిన రమేష్ కట్టెబోయిన శంకర్ తదితరులు పాల్గొన్నారు.



